అమెరికా, బ్రిటన్‌ల మధ్య చరిత్రాత్మక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒప్పందం కుదిరింది. 2025, సెప్టెంబరు 18న లండన్‌కు సమీపంలోని ఐల్స్‌బరీలో సమావేశమైన రెండు దేశాల అధినేతలు డొనాల్డ్ ట్రంప్, కీర్ స్టార్మర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 16వ శతాబ్దికి చెందిన రాజ భవనం చెకర్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. టెక్ ఒప్పందం ద్వారా బ్రిటన్‌లో అమెరికా కంపెనీలు 150 బిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.