తూర్పు ఆఫ్రికా ద్వీప దేశమైన మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా సైనిక తిరుగుబాటు నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా (50) 2025, అక్టోబరు 17న బాధ్యతలు చేపట్టారు. దేశంలో సైనిక తిరుగుబాటు చేసి పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన మూడు రోజుల తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మడగాస్కర్‌లో పేదరికం, విద్యుత్ కోతలు, పెరిగిన నిత్యావసర ధరలు తదితర కారణాలతో అక్కడి యువత నిరసనలకు దిగింది. దీనికి ‘క్యాప్సాట్’ మిలిటరీ యూనిట్ నేత కర్నల్ మైఖేల్ రణ్‌ద్రియానిరినా మద్దతు తెలిపారు.