ప్రవాస భారతీయుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం దీపావళి రోజును అధికారిక సెలవుగా ప్రకటించింది. దీంతో అమెరికాలో ఈ గుర్తింపును ఇచ్చిన మూడో రాష్ట్రంగా నిలిచింది. దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించాలని అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా సెప్టెంబరులో ప్రతిపాదించిన బిల్లు ఇప్పటికే సభ ఆమోదం పొందింది. తాజాగా దానిపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ సంతకం చేశారు.
పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు ఇప్పటికే దీపావళి రోజును అధికారిక సెలవుగా ప్రకటించాయి.