తెలంగాణలో జనన రేటు 2022తో పోల్చితే 2023 నాటికి 0.7 తగ్గనట్లు కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా-2025’ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, జాతీయ స్థాయి సగటుతో పోల్చితే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతోపాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోనూ జననరేటు తక్కువగా ఉంది.
2023 నాటికి రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననరేటు 15.8 ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 16.2, పట్టణాల్లో 15.2గా నమోదైంది. అదేసమయంలో జాతీయ స్థాయిలో 2022లో 19.1గా ఉన్న జననరేటు 2023కి 18.4గా నమోదైంది.