తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది.
దీంతో టీజీపీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు మొత్తం సభ్యుల సంఖ్య ఆరుకి చేరింది.
కొత్తగా నియమితులైన వారిలో ఐపీఎస్ అధికారి విశ్వప్రసాద్, గ్రూప్-1 సర్వీసు అధికారి (ప్రస్తుతం మహిళా కార్పొరేషన్ ఎండీ) సి.చంద్రకాంత్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఉన్నారు.
టీజీపీఎస్సీ సభ్యులుగా పదవీకాలం ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వరకు ఇందులో ఏది తక్కువైతే అప్పటివరకు కొనసాగుతారని పేర్కొంది.