దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్‌ఎంఈవో) పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
2021 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్రం 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని తొమ్మిది రాష్ట్రాలకు నిర్దేశించింది.
అందులో తెలంగాణ 1,25,300 హెక్టార్ల లక్ష్యానికి 78,869 హెక్టార్ల(63%)లో సాగు చేసి ముందు నిలిచింది.
ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ఉద్యానశాఖకు 2025, సెప్టెంబరు 21న సమాచారం అందించింది.