పంచాయతీలకు అవార్డులు

పంచాయతీలకు అవార్డులు
  • కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌ సింగ్‌ 2026, జూన్‌ 3న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ‘జాతీయ పంచాయతీ అవార్డులు-2025’ ప్రదానం చేశారు. ఉత్తమ పనితీరు కనబరిచిన 17 రాష్ట్రాల్లోని 42 పంచాయతీలకు అవార్డులు అందజేశారు.  ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం మోత్కుపల్లి పంచాయతీ 2025 సంవత్సరానికి సుపరిపాలన, డిజిటల్‌ విధానంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించిది. దీనికి దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కారం దక్కింది. సర్పంచి బైండ్ల అమృతమ్మ అందుకున్నారు.
  • మహిళానుకూలమైన విధానాల అమలు విభాగంలో 3వ ర్యాంకు సాధించిన సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాడీ గ్రామపంచాయతీ ప్రతినిధులకు సైతం కేంద్ర మంత్రి అవార్డులు, నగదు బహుమతులు అందజేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram