పీజీ, పీజీ డిప్లొమా 2025-26 కోర్సుల్లో ప్రవేశాలు

పీజీ, పీజీ డిప్లొమా 2025-26 కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం (ఏయూడీఓఏ) 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ, పీజీ డిప్లొమా (సెల్ఫ్‌ సపోర్టేడ్‌) కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

1. మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ - (40)

2. పీజీ డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ - (15)

3. పీజీ డిప్లొమా ఇన్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ - (15)

4. పీజీ డిప్లొమా ఇన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ - (15)

కోర్సు వ్యవధి: మాస్టర్‌ ఆఫ్‌ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌ రెండేళ్లు, పీజీ డిప్లొమా ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ 1 సంవత్సరం.

అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, బీ.ఫార్మసీ, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 35 ఏళ్లు.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 7.

చిరునామా: ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్‌ ప్లేస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నం-530003. చిరునామాకు దరఖాస్తులు పంపించాలి.

* కౌన్సెలింగ్ తేదీ: 2025 నవంబర్‌ 11.

కౌన్సెలింగ్‌ ఫీజు: రూ.200.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 7995013421, 7207953919.

Website:https://audoa.andhrauniversity.edu.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram