త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే విద్యా సంవత్సరం(2026-27)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2026) కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఎన్‌టీఏ (NTA) దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అర్హత: ఆరోతరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 2026 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు.
దరఖాస్తు రుసుం: జనరల్/రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.850; ఎస్సీ/ఎస్టీలకు రూ.700ల చొప్పున నిర్ణయించారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 10.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 30.
దరఖాస్తు రుసుం చెల్లింపునకు తుది గడువు: అక్టోబర్ 31 రాత్రి 11.50గంటల వరకు ఉంది.
దరఖాస్తు సవరణ తేదీ: దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ: పరీక్ష 2026 జనవరి నెలలో నిర్వహిస్తారు. కచ్చితమైన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేస్తారు. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.
పరీక్ష సమయం: ఆరో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంల నుంచి సాయంత్రం 4.30గంటలవరకు) 150 నిమిషాలు; తొమ్మిదో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు) 180 నిమిషాల చొప్పున ఉంటుంది.
ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా..: లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
తొమ్మిదో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా..: మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్