యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2025

యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2025

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2025 (యూజీసీ- నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే ఆన్‌లైన్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 

వివరాలు:

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ (యూజీసీ నెట్‌) 2025

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, తదితరాలు.

మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85.

అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.12.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, పెద్దాపూర్‌.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2025.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 07-11-2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 10 నుంచి 12-11-2025 వరకు.

పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు.

పరీక్ష తేదీ: తర్వాత వెల్లడించనున్నారు.

ఫలితాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు.

Website:https://ugcnet.nta.nic.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram