దేశవ్యాప్తంగా 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) లా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
పాల్గొనే విశ్వవిద్యాలయాలు: ఎన్‌ఎస్‌ఐయూ (బెంగళూరు), నల్సార్ (హైదరాబాద్), ఎన్‌ఎల్‌ఐయూ (భోపాల్), డబ్ల్యూబీఎన్‌యూజేఎస్ (కోల్‌కతా), ఎన్‌ఎల్‌యూ (జోధ్‌పూర్), హెచ్‌ఎన్‌ఎల్‌యూ (రాయ్‌పూర్), జీఎన్‌ఎల్‌యూ (గాంధీనగర్), ఆర్‌ఎంఎల్ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ), ఆర్‌జీఎన్‌యూఎల్ (పంజాబ్), సీఎన్‌ఎల్‌యూ (పట్నా), ఎన్‌యూఏఎల్‌ఎస్ (కొచ్చి), ఎన్‌ఎల్‌యూవో (ఒడిశా), ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్ (రాంచీ), ఎన్‌ఎల్‌యూజేఏ (అసోం), డీఎస్ ఎన్‌ఎల్‌యూ (విశాఖపట్నం), టీఎన్ ఎన్‌ఎల్‌యూ (తిరుచిరాపల్లి), ఎంఎన్‌ఎల్‌యూ (ముంబయి), ఎంఎన్‌ఎల్‌యూ (నాగ్‌పుర్), ఎంఎన్‌ఎల్‌యూ (ఔరంగాబాద్), హెచ్‌పీఎన్‌ఎల్‌యూ (షిమ్లా), డీఎన్‌ఎల్‌యూ (జబల్‌పూర్), డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ (హరియాణా), ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా), జీఎన్‌ఎల్‌యూ (సిల్వస్సా), ఆర్‌పీఎన్‌ఎల్‌యూపీ (ప్రయాగ్‌రాజ్), ఐఐయూఎల్‌ఈఆర్ (గోవా).
కోర్సులు:
1. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
2. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)
అర్హతలు: యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.4,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్ అభ్యర్థులకు రూ.3,500.
ముఖ్య తేదీలు:
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-07-2025.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31-10-2025.
* క్లాట్-2026 పరీక్ష (ఆఫ్‌లైన్) తేది: 07-12-2025.
Website: https://consortiumofnlus.ac.in/clat-2026/