జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2025కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. 

వివరాలు:

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2025

మొత్తం పరీక్ష పేపర్లు: 
1. కెమికల్‌ సైన్సెస్

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌

3. లైఫ్‌ సైన్సెస్

4. మ్యాథమేటికల్‌ సైన్సెస్

5. ఫిజికల్‌ సైన్సెస్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్‌, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు ఉండాలి.

వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్‌ 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.10.2025.

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 25.10.2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 27.10.2025 నుంచి 29.10.2025 వరకు.

పరీక్ష తేదీ: 18.12.2025.

Website:https://csirnet.nta.nic.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram