ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు

ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు

ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. 

వివరాలు:

డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డి.ఫార్మసీ) కోర్సు

వ్యవధి: రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.

అర్హత: రాష్ట్ర లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీ బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌(బైపీసీ లేదా ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 23.07.2026

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.08.2026.

Website:https://apsbtet.in/pharmacy/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram