ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026

ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026

విజయవాడలోని ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం.. 2026-2027 మొదటి సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎనిమిది పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

వివరాలు:

ఐటీఐ కోర్సు (ఫేజ్‌-1) అడ్మిషన్లు

ట్రేడ్: మెకానిక్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.

అర్హత: ఎనిమిది, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అప్రూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి పేర్లను మెరిట్‌ లిస్టులో పొందుపరుస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తైన వారే కౌన్సెలింగ్‌కు అర్హులుగా పరిగణిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30.06.2026.

ప్రభుత్వ ఐటీఐల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ చివరి తేదీ: 02.07.2026.

Website:https://itiadmissions.ap.gov.in/iti/open_editview_form.jsp

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram