బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఫోర్త్ పారడైమ్ ఇన్‌స్టిట్యూట్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 04
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 01
2. ప్రాజెక్ట్ అసోసియేట్-I/II: 02
3. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్, కంప్యూటర్ స్కిల్స్, తదితరాల పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు రూ.31,000; ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు రూ.35,000; సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000.
వయోపరిమితి: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 16.11.2025.
వేదిక: సీఎస్‌ఐఆర్-4పీఐ, ఎన్‌ఏఎల్ బేలూర్ క్యాంపస్, విండ్ టన్నెల్ రోడ్, బెంగళూరు.
Website:https://csir4pi.res.in/