లోక్ నాయక్ హాస్పిటల్‌ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

లోక్ నాయక్ హాస్పిటల్‌ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

దిల్లీ లోక్ నాయక్ హాస్పిటల్‌ (ఎల్‌ఎన్‌హెచ్‌) మెడికల్ డైరెక్టర్ కార్యాలయం.. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

వివరాలు:

సీనియర్ రెసిడెంట్ - 55 ఖాళీలు

విభాగాలు: రేడియోలజీ, మెడిసిన్, బయోకెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, బర్న్స్ & ప్లాస్టిక్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, అనెస్తీషియా తదితర విభాగాలు...

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఎంబీబీఎస్‌/ పీజీ/డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి అభ్యర్థులు 45 ఏళ్లకు మించకూడదు.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ డైరెక్టర్, లోక్ నాయక్ ఆసుపత్రి, దిల్లీ.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 ఆగస్టు 3, 5.

Website:https://lnjp.delhi.gov.in/doit-content/hospital-vacancy

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram