ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) గ్వాలియర్ ఒప్పంద  ప్రాతిపదికన స్పెషలిస్టు, సీనియర్ రెసిడెంట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 40

వివరాలు:

1.స్పెషలిస్టు పోస్టులు – 17

2. సీనియర్ రెసిడెంట్  – 23 

విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ తదితర విభాగాలు..

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కొన్ని పోస్టులకు అనుభవం అవసరం.

వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 జులై 29.

Website:https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram