డీఆర్‌డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

డీఆర్‌డీఓ కాన్పూర్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కాన్పూర్‌లోని డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ), అర్హులైన అభ్యర్థుల నుంచి పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

పెయిడ్ ఇంటర్న్‌షిప్ - 20 ఖాళీలు

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాలు.....

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్‌/ఎంటెక్‌/ఎమ్మెస్సీ కోర్సుల్లో చివరి సంవత్సరంలో చదువుతూ ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.5,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ / ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా director.dmsrde@gov.inకు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 15 జూన్ 2026.

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram