కోల్‌కతా హెడ్ క్వర్టర్స్‌గా గల యుకో బ్యాంక్ 2025-26 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 8 ఖాళీలున్నాయి. ఈ నియామకానికి అభ్యర్థులు ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి.
మొత్తం పోస్టులు: 532
వివరాలు:
ఆంధ్రప్రదేశ్- 7
తెలంగాణ- 8
తమిళనాడు- 21
కర్ణాటక- 12
కేరళ- 10
ఉత్తరప్రదేశ్- 46
పశ్చిమ బెంగాల్- 86
బిహార్- 35
(ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 532 ఖాళీలు)
అర్హతలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం అవసరం.
వయోపరిమితి: 01.10.2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.15,000./-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం: (100 మార్కులు, 60 నిమిషాలు) జనరల్/ఫైనాన్స్ అవేర్‌నెస్-25, ఇంగ్లిష్/హిందీ భాష- 25, రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ - 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 25
దరఖాస్తు విధానం: అభ్యర్థులు మొదట ఎన్‌ఏటీఎస్ పోర్టల్ లో(NATS Portal) https://nats.education.gov.in రిజిస్టర్ కావాలి. తరువాత యుకో బ్యాంక్ వెబ్‌సైట్ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400+జీఎస్‌టీ; జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800+జీఎస్‌టీ; ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.
దరఖాస్తు ముగింపు తేదీ: 30-10-2025
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 05-11-2025
ఆన్‌లైన్ పరీక్ష: 09-11-2025.