ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దిల్లీ (ఓఎన్‌జీసీ) వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 2,623
వివరాలు:
సెక్టార్ల వారిగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు..
1. నర్తర్న్ సెక్టార్: 165
2. ముంబయి సెక్టార్: 569
3. వెస్టర్న్ సెక్టార్: 856
4. ఈస్టర్న్ సెక్టార్: 458
5. సౌతర్న్ సెక్టార్: 322
6. సెంట్రల్ సెక్టార్: 253
విభాగాలు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ల్యాబ్ కెమిస్ట్, అనలిస్ట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, డిసిల్ మెకానిక్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, పెట్రోలియం ఎగ్జిక్యూటివ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 6వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.9,600 - రూ.10,560, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12,300.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 నవంబర్ 6.
Website:https://ongcindia.com/