కోల్‌కతాలోని ఐఆర్‌సీటీసీ ఈస్ట్‌జోన్‌లో కింది విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ)- 45 ఖాళీలు
అర్హత: మెట్రిక్యూలేషన్, సీఓపీఏ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.9,600.
వ్యవధి: 12 నెలలు.
వయోపరిమితి: 01.10.2025 నాటికి 15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
పని ప్రదేశం: ఈస్ట్‌జోన్, కోల్‌కతా.
దరఖాస్తు విధానం: అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 28.10.2025.