బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు

బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌), హైదరాబాద్‌.. కాంచన్‌బాగ్ యూనిట్‌లో అప్రెంటిస్‌షిప్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుంచి అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 147

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్‌)- 122

  2. డిప్లొమా అప్రెంటిస్ (డిప్లొమా) - 25

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్‌)కు రూ.12,300. డిప్లొమా అప్రెంటిస్ (డిప్లొమా)కు రూ.10,900.

ఎంపిక ప్రక్రియ: మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా hrkbu-app@bdl-india.in కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఆగస్టు 06.

Website: https://bdl-india.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram