హైదరాబాద్‌లోని డిఆర్‌డీఓకు చెందిన డా.ఏపీజే అబ్దుల్ కలాం మిషైల్ కాంప్లెక్స్- రిసెర్చ్ సెంటర్ ఇమరాట్ 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 195
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40
2. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 20
3. ట్రేడ్ అప్రెంటిస్: 135
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.09.2025 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.
2021, 2022, 2023 2024, 2025లో 70% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఎన్‌టీఏ, అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 25.10.2025.
Website:https://drdo.gov.in/drdo/