నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన తన కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో వివిధ విభాగాల్లో ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 87
వివరాలు:
1. డిప్లొమా ఇంజినీర్స్: 15
2. డిగ్రీ ఇంజినీర్స్: 72
విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఫైర్/ ఇండస్ట్రియల్, ఇన్‌స్పెక్టర్, మెనేజ్‌మెంట్ సర్వీసెస్, మెకానికల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానునుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్టి్ంగ్, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2025.
Website:https://www.pdilin.com/