తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీజీసీఏబీ) హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* మొత్తం పోస్టుల సంఖ్య: 225
వివరాలు:
1. స్టాఫ్ అసిస్టెంట్ (హైదరాబాద్): 32
2. స్టాఫ్ అసిస్టెంట్ (కరీంనగర్): 43
3. స్టాఫ్ అసిస్టెంట్ (ఖమ్మం): 99
4. స్టాఫ్ అసిస్టెంట్ (మహబూబ్‌నగర్): 09
5. స్టాఫ్ అసిస్టెంట్ (మెదక్): 21
6. స్టాఫ్ అసిస్టెంట్ (వరంగల్): 21
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం. ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.24,050- రూ.64,480 + ఇతర అలవెన్సులు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు పీజు: జనరల్/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2025.
Notification: https://tgcab.bank.in/notifications
Website: https://tgcab.bank.in/