నాగ్‌పుర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 99
వివరాలు:
1. ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -III - 15
2. మెకానిక్-కమ్-ఆపరేటర్ గ్రేడ్ -III (ఫిట్టర్) - 35
3. మెకానిక్-కమ్-ఆపరేటర్ గ్రేడ్ -III (వెల్డర్) - 04
4. మైన్ ఫోర్‌మెన్-I - 09
5. సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్ - 05
6. మైన్ మేట్ గ్రేడ్ -I - 23
7. బ్లాస్టర్ గ్రేడ్ -II - 08
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ, బీఈ/బీటెక్ (ఎలక్ట్రీషియన్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గమనిక: చెల్లుబాటు అయ్యే మైన్ ఫోర్‌మెన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2025 నవంబరు 6వ తేదీ నాటీకి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మించకూడదు. జనరల్, ఈడౠ్ల్యఎస్, మాజీ ఉద్యోగులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వమోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ఎలక్ట్రీషియన్ గ్రేడ్ -III పోస్టులకు రూ.23,400 -రూ.42,420, మెకానిక్-కమ్-ఆపరేటర్ గ్రేడ్ -IIIకి రూ.23,400 - రూ.42,420, మెకానిక్-కమ్-ఆపరేటర్ గ్రేడ్ -III (వెల్డర్)కు రూ.23,400 - రూ.42,420, మైన్ ఫోర్‌మెన్-Iకు రూ.23,400 - రూ.42,420, సెలెక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్‌కు రూ.27,600 - రూ.50,040, మైన్ మేట్ గ్రేడ్ -Iకు రూ.24,800 - రూ.44,960, బ్లాస్టర్ గ్రేడ్ -IIకు రూ.24,100 - రూ.43,690.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, థానే, చెన్నై, భోపాల్, రాయ్‌పుర్, నాగ్‌పుర్, హైదరాబాద్.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడౠ్ల్యఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 6.