ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ అండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు 

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌ అండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులు 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 2025 సంవత్సరానికి  సంబంధించి నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (గ్రాడ్యుయేట్‌ అండ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌) సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్‌ (CEN 2025)ను విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 8,050. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్‌ పోస్టులు ఉన్నాయి. 

వివరాలు:

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్‌లోని గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులలో గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, చీఫ్ కమర్షియల్-కమ్-టికెట్ సూపర్‌వైజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, అండర్ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, రైళ్ల క్లర్క్ ఖాళీలున్నాయి. 

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

అర్హత: గ్రాడ్యుయేట్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 16- 33 ఏళ్లు; అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 18- 38 సంవత్సరాల మధ్య ఉండాలి.

* గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 21.10.2025.

* అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 28.10.2025.

* గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025.

* అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.

Website:https://www.rrbapply.gov.in/#/auth/landing

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram