జమ్మూలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ జమ్మూ) రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
* మొత్తం పోస్టుల సంఖ్య - 80
వివరాలు:
1. ప్రొఫెసర్
2. అడిషనల్ ప్రొఫెసర్
3. అసోసియేట్ ప్రొఫెసర్
4. అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు:
అనస్థిషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ , కాలిన గాయాలు, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడిసిన్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ప్రసూతి & గైనకాలజీ,ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ, ఫిజికల్ మెడిసిన్,పునరావాసం, ఫిజియాలజీ,సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్, ట్రామా & ఎమర్జెన్సీ, మెడిసిన్,యూరాలజీ.
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, డిఎం, ఎంహెచ్, పీహెచ్‌డీ (అనాటమీ/బయోకెమిస్ట్రీ కార్డియాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అనస్థీషియాలజీ, డెర్మటాలజీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు ,ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900 - రూ.2,20,400, అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200 - రూ.2,11,400.అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300 - రూ. 2,09,200.అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్,ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఈడౠ్ల్యఎస్, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.2400.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 24.10.2025,
హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ : 28.10.2025.
చిరునామా: రిజిస్ట్రార్ అకడమిక్ బ్లాక్, 6వ అంతస్తు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయ్పూర్, జమ్మూ, 1841134.