మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెసర్, అదనపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 121
వివరాలు:
1. ప్రొఫెసర్: 10
2. అడిషనల్ ప్రొఫెసర్: 08
3.అసోసియేట్ ప్రొఫెసర్: 20
4.అసిస్టెంట్ ప్రొఫెసర్: 83
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎంహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 58 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థలకు 3 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థలకు 10 ఏళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్‌కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,38,300, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,01,500.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు: జనరల్ ఈడౠ్ల్యఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,100. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థలకు రూ.2,100. పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 26.