డీసీసీబీ ప్రకాశంలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

డీసీసీబీ ప్రకాశంలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

స్టాఫ్ అసిస్టెంట్ : 60

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: 2026 జూన్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.47,000.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్ కు రూ.590 ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ కు రూ.826.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 జులై 24

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఆగస్టు 7

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 2026 ఆగస్టు 7

ఆన్‌లైన్ పరీక్ష: 2026 ఆగస్టు/సెప్టెంబర్ (తాత్కాలికంగా).

Website:https://prakasamdccb.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram