చిత్తూరు సహకార కేంద్ర బ్యాంక్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

చిత్తూరు సహకార కేంద్ర బ్యాంక్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ)లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

స్టాఫ్ అసిస్టెంట్ - మొత్తం 75 పోస్టులు

  • ఓపెన్ మార్కెట్: 67 పోస్టులు

  • పీఏసీఎస్‌ (PAC)S సిబ్బంది: 8 పోస్టులు

అర్హత: ఓపెన్ మార్కెట్ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లిష్ పరిజ్ఞానంతో పాటు తెలుగు స్థానిక భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్‌పై పని పరిజ్ఞానం తప్పనిసరి. ఈ పోస్టులు పూర్వపు చిత్తూరు జిల్లా పరిధికి చెందిన ప్రాంతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పీఏసీఎస్‌ సిబ్బందికి ఇంటర్మీడియట్‌తో పాటు జేడీసీ/హెచ్‌డీసీ/డీసీఆర్‌ఎస్‌ లేదా గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.06.2026 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. పీఏసీఎస్‌ ఇన్-సర్వీస్ అభ్యర్థులకు ప్రత్యేక వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.47,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష 200 మార్కులకు, 200 ప్రశ్నలకు ఉంటుంది. మొత్తం 2 గంటల పరీక్ష వ్యవధి. రీజనింగ్‌ 40 ప్రశ్నలు, 50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు, 50 మార్కులు, ఇంగ్లిష్‌ ల్వాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు, 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు, 40 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు, 20 మార్కులకు ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి టెస్ట్‌లో కనీస అర్హత సాధించాలి. తుది ఎంపిక ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు.
పీఏసీఎస్‌ (PACS) ఇన్-సర్వీస్ అభ్యర్థులకు: 50 ప్రశ్నలు, 100 మార్కులు, 60 నిమిషాల ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు పీఏసీఎస్‌ పని విధానాలు, విధులపై ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌సర్విస్‌మెన్‌కు రూ.590, ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.826.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 07.08.2026.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 07-08-2026

ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు/సెప్టెంబర్ 2026 (తాత్కాలికంగా)

Website:https://ibpsreg.ibps.in/dccbmay26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram