యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 828

వివరాలు:

  1. ప్రిన్సిపాల్ - 124 (పురుషులు: 72 మహిళలు: 52)
    జనరల్ : 69, ఈడబ్ల్యూఎస్‌-11, ఓబీసీ-18, ఎస్సీ-16, ఎస్టీ-10

  2. వైస్ ప్రిన్సిపాల్- 704 (పురుషులు: 364 మహిళలు: 340)
    జనరల్ - 287 ఈడబ్ల్యూఎస్‌-71, ఓబీసీ-189, ఎస్సీ-103, ఎస్టీ-54

గరిష్ఠ వయోపరిమితి:

ప్రిన్సిపాల్‌ పోస్టుకు జనరల్‌/ఈడబ్ల్యూకు 50 ఏళ్లు; ఓబీసీ- 53 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ- 55
వైస్ ప్రిన్సిపాల్‌కు జనరల్‌/ఈడబ్ల్యూకు 35 ఏళ్లు; ఓబీసీ- 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ- 40.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/బీఈడీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: 7వ సీపీసీ ప్రకారం పే లెవెల్- 10/12 ద్వారా చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌, పురుషులు: రూ.25. మహిళలు / ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ అభ్యర్థులు: దరఖాస్తు రుసుం మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్: ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: వ్యవధి: 2 గంటలు, గరిష్ఠ మార్కులు: 300. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25-07-2026

దరఖాస్తుకు చివరి తేదీ: 14-08-2026.

రాత పరీక్ష (CRT) తేదీ: 01-11-2026.

Website:https://www.upsc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram