ఇస్రోలో అసిస్టెంట్‌ పోస్టులు

ఇస్రోలో అసిస్టెంట్‌ పోస్టులు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌.. వివిధ సెంటర్లు, స్వయంప్రతిపత్తి సంస్థలలో పే మ్యాట్రిక్స్ లెవెల్ 4 విభాగంలో ఉన్న పోస్టుల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 242

వివరాలు:

  • అసిస్టెంట్: 128

  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్: 81

  • అప్పర్ డివిజన్ క్లర్క్: 22

  • స్టెనోగ్రాఫర్: 10

  • జూనియర్ పర్సనల్ అసిస్టెంట్: 01

అర్హతలు: అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) పోస్టులకు కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కమర్షియల్/సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణతతో పాటు స్టెనో-టైపిస్ట్/స్టెనోగ్రాఫర్‌గా ఏడాది అనుభవం, ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 16.08.2026 నాటికి 28 ఏళ్లు. ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 33 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.25,500+ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500(ప్రాసెసింగ్‌ ఫీజు), ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్విస్‌మెన్‌, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, హాసన్, హైదరాబాద్, మహేంద్రగిరి, న్యూదిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురం.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 27.08.2026.

దరఖాస్తు చివరి తేదీ: 16.08.2026.

Website: https://www.isro.gov.in/index.html

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram