ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న కేటగిరీకి .. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మేనేజర్‌, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 389

వివరాలు:

మేనేజర్‌: 260

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: 129

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, లా, ఫైర్‌ సర్విస్‌, ఆపరేషన్స్‌, కమర్షియల్‌, కార్పొరేట్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్విస్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, ఆపరేషన్స్‌, సర్వే అండ్‌ కార్టోగ్రఫీ.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం/సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ, బీఆర్క్‌, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: మేనేజర్‌ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000(ఏడాదికి 21లక్షలు); జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.40,000- రూ,1,40,000(ఏడాదికి రూ.14 లక్షలు).

వయోపరిమితి: 07-09-2026 నాటికి మేనేజర్‌ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: పోస్టును బట్టి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీ, పీఎంటీ, డ్రైవింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08.08.2026.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 07.09.2026

Website:https://www.aai.aero/en/careers/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram