ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో డాక్టర్స్‌ ఉద్యోగాలు

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో డాక్టర్స్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) నవరత్న కంపెనీ, ముంబయిలోని ట్రాంబే యూనిట్‌ ఆసుపత్రి కోసం హనరరీ డాక్టర్స్‌ కోసం వివిధ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 46

వివరాలు:

హనరరీ డాక్టర్స్‌(గౌరవ వైద్యులు): 31

ప్యానెల్‌ డాక్టర్స్‌: 15

విభాగాలు: ఫిజిషియన్‌, ఆర్థోపెడిక్‌ సర్జన్‌, డెంటిస్ట్‌, రేడియాలజీ, ఈఎన్‌టీ సర్జన్‌, పీడియాట్రిషియన్‌, జనరల్‌ సర్జన్‌, కార్డియాలజిస్ట్‌, యూరాలజీ, సైకియాట్రిస్ట్‌.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డీఎం/ఎంసీహెచ్ లేదా సమానమైన అర్హత అవసరం. ప్యానెల్‌ డాక్టర్‌ పోస్టులకు ఎంబీబీఎస్‌ డిగ్రీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ హోదా, ఇంటర్న్‌షిప్ మినహా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. సొంత క్లినిక్/డిస్పెన్సరీ, ఓపీడీ సదుపాయాలు, ఆన్‌లైన్ కంప్యూటర్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను చెంబురు, ముంబయి చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website:https://www.rcfltd.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram