తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య - 1,743
వివరాలు:
1. డ్రైవర్స్: 1000
2. శ్రామిక్: 743
అర్హత: పోస్టులను అనుసరించి ఐటీఐ, పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు డ్రైవర్ పోస్టులకు రూ.20,960 - రూ.60,080, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 - రూ.45,030.
దరఖాస్తు ఫీజు: డ్రైవర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600. శ్రామిక్ పోస్టులకు రూ.200, ఇతరులకు రూ.400.
ఎంపిక విధానం: ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 8.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 28.
Website:https://www.tgprb.in/