ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ప్రఫుల్ల చంద్ర రే 

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. మనదేశంలో మొదటి ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించారు.


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. మనదేశంలో మొదటి ఫార్మాస్యూటికల్‌ కంపెనీ అయిన బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించారు. అనేక రసాయన కర్మాగారాలను నెలకొల్పారు. ఇండియన్‌ కెమికల్స్‌ సొసైటీ స్థాపనలోనూ రే కీలకంగా వ్యవహరించారు. ఆధునిక భారతదేశంలో మొదటిసారిగా రసాయన ప్రయోగశాలలతో కూడిన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేశారు. ఈయన్ను భారత రసాయన పితామహుడిగా పేర్కొంటారు. వాణిజ్యపరంగా రసాయన ఉత్పత్తి పద్ధతుల్లో యువతకు శిక్షణ ఇచ్చారు. భారతదేశ విజ్ఞాన వైభవాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా అనేక వ్యాసాలు రాశారు. పోటీపరీక్షల నేపథ్యంలో ఈయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • ప్రఫుల్ల చంద్ర రే 1861, ఆగస్టు 2న బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని రారులి-కటిపారా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. ప్రాథమిక విద్యను ఊరి పాఠశాలలో, సెకండరీ విద్యను కోల్‌కతాలోని హరే స్కూల్, ఆల్బర్ట్‌ పాఠశాలలో పూర్తి చేశారు
  • 1878లో మెట్రిక్యులేషన్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పండిట్‌ ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ స్థాపించిన మెట్రోపాలిటన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (ప్రస్తుతం విద్యాసాగర్‌ కాలేజీ)లో ఫస్ట్‌ ఆర్ట్స్‌ (ఎఫ్‌ఏ) విద్యార్థిగా చేరారు. ప్రముఖ జాతీయవాది సురేంద్రనాథ్‌ బెనర్జీ ఆ సంస్థలో ఆంగ్ల సాహిత్య ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఆయన ప్రసంగాలు రే ను ఎంతగానో ప్రభావితం చేశాయి.
  • ఎఫ్‌ఏ లో కెమిస్ట్రీ తప్పనిసరి సబ్జెక్ట్‌. ఆయన చదివే సంస్థలో సైన్స్‌ కోర్సులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. దీంతో ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో బాహ్య విద్యార్థిగా (external student) ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉపన్యాసాలకు హాజరయ్యేవారు. 
  • 1881లో కోల్‌కతా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ మెయిన్‌ సబ్జెక్ట్‌గా, డిగ్రీలో చేరారు. చదువుతున్న సమయంలోనే 1882లో ఆయనకు గిల్‌క్రిస్ట్‌ స్కాలర్‌షిప్‌ లభించింది. దీని సాయంతోనే ఆయన బ్రిటన్‌లోని ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలో సైన్స్‌ విద్యార్థిగా చేరారు. ఒకసారి విశ్వవిద్యాలయంలో ‘1857 సైనిక తిరుగుబాటుకు ముందు, తర్వాత భారతదేశం’ అనే అంశంపై వ్యాస పోటీలు నిర్వహించారు. అందులో రే పాల్గొని బ్రిటిష్‌ వలస పాలన వల్ల కలిగిన నష్టాలను సమగ్రంగా వివరించారు. ఇది అనేకమంది దృష్టిని ఆకర్షించింది.  1885లో ఆయన బీఎస్సీ పట్టా పొందారు. 
  • తర్వాత ఎడిన్‌బర్గ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న అలెగ్జాండర్‌ క్రమ్‌ వద్ద చేరి తన డాక్టోరల్‌ అధ్యయనాలను ప్రారంభించారు. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీపై తన పరిశోధనలు కేంద్రీకరించారు. 1887లో "Conjugated Sulphates of the Copper-magnesium Group: A Study of Isomorphous Mixtures and Molecular Combinations" అనే థీసిస్‌తో డీఎస్సీ (డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌) పట్టా పొందారు. 
  • 1888లో ఎడిన్‌బర్గ్‌ కెమికల్‌ సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
  • 1888 ఆగస్టులో రే భారతదేశానికి తిరిగి వచ్చి, కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా చేరారు. 1916లో పదవీ విరమణ చేసేవరకు అక్కడే పనిచేశారు. ప్రముఖ శాస్త్రవేత్తలైన మేఘానంద సాహా, శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ మొదలైన వారు ‘రే’ శిష్యులే. 
  • 1916లో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పాలిట్‌ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. మరణించేవరకు ఆ పదవిలో కొనసాగారు. 

ప్రముఖ రచనలు

  • 1899లో ‘ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథం రాశారు.
  • చంద్ర రే రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ హిందూ కెమిస్ట్రీ’ పుస్తకాన్ని అత్యంత విలువైన, మేధోపరమైన రచనగా భావిస్తారు. దీని మొదటి వాల్యూమ్‌ 1902లో రాగా, రెండో సంపుటి 1909లో ప్రచురితమైంది.
  • రే 1906లో బెంగాలీ భాషలో “Nabya Rasayanividhya O Tahar Utsa” అనే గ్రంథం రాశారు. 
  • 1909లో కళాశాల విద్యార్థుల కోసం ‘ఎలిమెంటరీ ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీ’ పుస్తకం రచించారు. 
  • తన ఆత్మకథను ‘లైఫ్‌ అండ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ ఆఫ్‌ ఏ బెంగాలీ కెమిస్ట్‌’ పేరుతో రాశారు. మొదటి సంపుటి 1932లో రెండోది 1935లో విడుదలైంది. 

పురస్కారాలు - గౌరవాలు

  • 1902లో కెమికల్‌ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు.
  • 1907లో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.
  • 1912లో కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎంపైర్‌ గౌరవం పొందారు.
  • 1919లో నైట్‌హుడ్‌ బిరుదు అందుకున్నారు.
  • భారతీయ, బ్రిటిష్‌ యూనివర్సిటీల నుంచి అయిదు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీలు పొందారు.
  • 1920లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జనరల్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 

చివరగా

  • రసాయనశాస్త్రంలో విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూనే రే జాతీయోద్యమంలోనూ తన వంతు కృషి చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. బెంగాల్‌ విప్లవకారులకు రహస్య సాయం చేశారు. పారిశ్రామికంగా ఎదగడం ద్వారానే భారత్‌ అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వసించారు. యువతకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆయన బలంగా కోరుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రే వందో జయంతి నాడు 1961, ఆగస్టు 2న ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. ప్రఫుల్ల చంద్ర రే 1944, జూన్‌ 16న కోల్‌కతాలో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(డబ్ల్యూబీ టీఈటీ, 2015)

Q: ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే కింది ఏ విధంగా ప్రసిద్ధి చెందారు?

1) సల్ఫేట్‌ల మాస్టర్‌        2) నైట్రేట్‌ల మాస్టర్‌

3) నైట్రైట్‌ల మాస్టర్‌        4) సల్ఫైడ్‌ల మాస్టర్‌

సమాధానం: 3

(WBPSC Food SI 2024)

Q: Acharya Prafulla Chandra Roy was a famous
1) Doctor             2) Chemist
3) Physicist        4) Mathematician
Answer: 2

(WBSSC Group D, 2017)

Q: The founder of the Bengal Chemical organisation was
1) Nil Ratan Sarkar                2) Prafulla Chandra Roy
3) Dwarakanath Tagore            4) Alamohan Das
Answer: 2

(UPSC CAPF, 2015)

Q: Who among the following was NOT a Communist leader in colonial India?
1) P. C. Roy            2) S. A. Dange
3) Muzaffar Ahmad        4) Singaravelu
Answer: 1

 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram