ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

గ్రెగర్‌ జోహాన్‌ మెండల్‌

ఈయన ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, క్రైస్తవ మత గురువు. సంతానానికి వంశానుగతంగా శారీరక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయనే దానిపై   మొదటిసారిగా ప్రయోగాలు నిర్వహించింది ఈయనే


ఈయన ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, క్రైస్తవ మత గురువు. సంతానానికి వంశానుగతంగా శారీరక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయనే దానిపై   మొదటిసారిగా ప్రయోగాలు నిర్వహించింది ఈయనే. వంశపారంపర్య నియమాలను ప్రతిపాదించారు కూడా. తన పరిశోధనల కోసం ముందుగా ఆయన మొక్కలనే ఎంచుకున్నారు. ముఖ్యంగా బఠానీ మొక్కలపై ప్రయోగాల ద్వారా అనువంశిక సూత్రాలను (Mendel’s laws of inheritance) కనుక్కున్నారు. వారసత్వ లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి ఎలా సంక్రమిస్తాయో ఇవి వివరించాయి. జన్యుశాస్త్ర అభివృద్ధిలో ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే మెండల్‌ను ‘జన్యుశాస్త్ర పితామహుడిగా (Father of Genetics)’ పేర్కొంటారు. జనవరి 6న మెండల్‌ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - సన్యాసి జీవితం

  • జోహాన్‌ మెండల్‌ 1822, జులై 20న నాటి ఆస్ట్రియాలో అంతర్భాగమైన మొరాబియాలో (ప్రస్తుతం చెెకోస్లొవేకియాలో ఉంది) జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో పూర్తి చేశారు. నేచురల్‌ హిస్టరీ, తోట పనులు పాఠ్యాంశంగా ఉండటంతో చిన్నతనం నుంచే ఆయనకు మొక్కల పెంపకంపై అవగాహన, ఇష్టం ఏర్పడ్డాయి. 
  • సెకండరీ విద్య కోసం 1834లో ట్రోప్పా (ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్‌లో ఉంది)లోని జిమ్నాసియంకు వెళ్లారు. అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే వదలాల్సి వచ్చింది.  
  • మెండల్‌ 1843లో బోర్నోలోని సెయింట్‌ థామస్‌ అగస్టీనియన్‌ అబ్బేలో చేరారు. అక్కడే గ్రెగర్‌ అనే పేరు స్వీకరించి, సన్యాసి జీవితంలో స్థిరపడ్డారు. ఆయన వేదాంతం, సైన్స్, సాహిత్యం నేర్చుకున్నారు. జన్యుశాస్త్ర రంగంలో పరిశోధనలకు అక్కడే పునాది పడింది.
  • చదువు పూర్తయ్యాక మెండల్‌ ఆ మఠంలోనే ఉపాధ్యాయుడిగా చేరారు. తోట నిర్వహణ సహా వివిధ బాధ్యతలు స్వీకరించారు. అలా వంశపారంపర్య రహస్యాలను కనుక్కునేందుకు తోటలోని మొక్కల ద్వారా అవకాశం లభించింది. 

బఠానీ మొక్కపై ప్రయోగాలు

  • ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లో సారూప్య పోలికలు, లక్షణాలు ఉంటాయి. అప్పట్లో ఈ విషయంపై జీవశాస్త్రజ్ఞులు ఎంతో ఆలోచించారు. సంతానంలోని వివిధ శారీరక లక్షణాలను ఎలా విడదీయాలో వాళ్లకు తెలిసేది కాదు. ఒకేసారి కాకుండా ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని విడివిడిగా అధ్యయనం చేయాలని మెండల్‌ ప్రతిపాదించాడు.
  • ఆ క్రమంలో 1865లో పరిశోధనల కోసం మెండల్‌ బఠానీ మొక్కల్ని ఎంచుకున్నారు.
  • పొడవైన బఠానీ మొక్కలు, పొడవైన మొక్కల్ని.. పొట్టిగా ఉండే మొక్కలు పొట్టి మొక్కల్ని ఉత్పన్నం చేస్తాయి. అదే పొడవైన మొక్కలను, పొట్టి మొక్కలతో సంపర్కం చేస్తే... పొడవు మొక్కలు వస్తున్నట్టు మెండల్‌ గమనించాడు. అంటే మొక్కలో పొడవుగా ఉండే లక్షణం పొట్టిగా ఉండే లక్షణాన్ని నియంత్రిస్తుందని గుర్తించారు. ఇదే ‘మెండల్‌ నియంత్రణ నియమం’ (Law of Dominance).
  • ఆ తర్వాత స్వచ్ఛమైన పొడవు మొక్కలు, పొట్టి మొక్కల సంతానమైన హైబ్రిడ్‌ మొక్కలపై మెండల్‌ ప్రయోగాలు చేశారు. ఈ హైబ్రిడ్‌ మొక్కల మధ్య సంపర్కం జరిగితే ఆ సంతానంలో సగభాగం హైబ్రిడ్‌ మొక్కలైతే మిగతా సగం స్వచ్ఛమైన పొడవు మొక్కలు, స్వచ్ఛమైన పొట్టి మొక్కలుంటాయి. మెండల్‌ ఈ పరిశీలనను ‘ఖండీకరణ నియమం’గా ప్రతిపాదించారు.

చివరగా

మెండల్‌ చెప్పిన విషయాలను మొదట్లో శాస్త్రీయ సమాజం గుర్తించలేదు. ఆయన మరణించిన తర్వాతే వాటికి విశేష గుర్తింపు లభించింది. 1900లలో శాస్త్రవేత్తలు ఆయన భావనలను వంశపారంపర్య సిద్ధాంతానికి మూలాలుగా స్వీకరించారు. అవి జన్యుశాస్త్రం (జెనెటిక్స్‌), వంశాభివృద్ధి శాస్త్రానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన 1884, జనవరి 6న మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: మెండల్‌ కింది ఏ మొక్కలను సంకరీకరించడం ద్వారా వారసత్వ లక్షణాలను విశ్లేషించారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీజీ - నేచురల్‌ సైన్స్, 2025)

1) తోట బఠానీ మొక్కలు

2) గులాబీ మొక్కలు

3) ఆవాల మొక్కలు

4) మామిడి మొక్కలు

సమాధానం: 1 

Q: Mendel used a number of contrasting visible characters of garden peas. Match the last of the following with Which one of the following options appropriately fills the below blank space?
A. Round / Wrinkled seeds
B. Tall / Short plants
C. White / ______ flowers 
(RRB Technician Grade III, 2024)
1) Pink               2) Green 
3) Yellow           4) Violet 
Ans: 4
Q: Mendel worked with a number of contrasting visible characters of garden peas. Some of them were:
a) Round and Wrinkled seeds 
b) tall and short plants
c) white and violet flowers
Which of these are the recessive traits in the pea plant?
(RRB Group D, 2022)
1) Violet, short and round
2) Wrinkled, short and white
3) Wrinkled, short and violet
4) Round, short and white
Ans: 2
Q: Mendel proposed the law of independent assortment on the basis of __________.
(SSC CHSL, 2024)
1) dihybrid crosses            2) alleles
3) monohybrid crosses        4) genes
Ans: 1


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram