ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

బీర్బల్‌ సాహ్ని

ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు (Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. మొక్కల వర్గీకరణ, జీవావరణశాస్త్రం, జీవభూగోళశాస్త్ర రంగాల్లో గణనీయ కృషి చేశారు


ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు (Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. మొక్కల వర్గీకరణ, జీవావరణశాస్త్రం, జీవభూగోళశాస్త్ర రంగాల్లో గణనీయ కృషి చేశారు. ఈయన భూగర్భశాస్త్రం, పురావస్తుశాస్త్రంలోనూ పరిశోధనలు చేశారు.  భారతదేశంలో విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి విశేషంగా తోడ్పాటు అందించారు. భారత ఉపఖండంలోని శిలాజ మొక్కలు, వాటి పరిణామం గురించి అనేక రచనలు చేశారు. ఈయన్ను భారతదేశ పురాతన వృక్షశాస్త్ర పితామహుడిగా (Father of Indian Paleobotany) పేర్కొంటారు. 

బాల్యం - వృత్తి జీవితం

  • బీర్బల్‌ సాహ్ని 1891, నవంబరు 14న షాహ్‌పూర్‌లోని భేరాలో (ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉంది) జన్మించారు.
  • ప్రాథమిక విద్యాభ్యాసాన్ని లాహోర్‌లోని సెంట్రల్‌ మోడల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే బీర్బల్‌కు మొక్కలు, చెట్లు అంటే ఆసక్తి ఉండేది. పెరిగే విధానం, ప్రాంతాలను బట్టి వృక్షాల గురించి తెలుసుకుంటూ ఉండేవారు. వాటికి సంబంధించిన పుస్తకాలనే ఎక్కువగా చదివేవారు.
  • 1911లో లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల నుంచి నేచురల్‌ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు.
  • కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని ఇమ్మాన్యుయేల్‌ కాలేజీలో చేరి, 1914లో పట్టా పొందారు.
  • 1914లో ప్రఖ్యాత శిలాజ వృక్షశాస్త్రవేత్త (paleobotanist) ఎ.సి.స్టీవార్డ్‌ వద్ద ఇంటర్న్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన వద్ద అనేక విషయాలు తెలుసుకున్నారు. వారిద్దరూ భారతీయ గోండ్వానా మొక్కలపై (పాలియోంటోలాజికా ఇండికా) పరిశోధనలు చేశారు. 
  • బీర్బల్‌ 1920లో భారత్‌కు తిరిగివచ్చారు. వారణాసిలోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు.
  • 1921లో లక్నో యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగానికి మొదటి అధిపతిగా, ఆచార్యుడిగా నియమితులయ్యారు. మరణించే వరకు ఆయన ఇక్కడే పనిచేశారు.

ముఖ్యమైన పరిశోధనలు

  • బీర్బల్‌ భారతీయ వృక్షజాతులపైనే కాకుండా ఇతర దేశాల్లోని మొక్కలపైనా పరిశోధనలు చేశారు.
  • భారత్‌లోని రాజ్‌మహల్‌ కొండల్లోని శిలాజల నుంచి బెన్నెటిటేలియన్‌ మొక్కను కనిపెట్టి, దానికి విలియమ్సోనియా సెవార్డి అని పేరు పెట్టారు. ఇది సైకాడ్‌లను పోలి ఉండే అంతరించిపోయిన విత్తన మొక్కల సమూహం అని తేల్చారు. ఇది జురాసిక్‌ యుగానికి చెందిందని చెప్పారు. తన పరిశోధన విషయాలను 1932లో ప్రచురించారు.
  • పిలియోజోయిక్‌ కాలంనాటి (541 నుంచి 252 మిలియన్‌ సంవత్సరాల క్రితం) ఫెర్న్‌ల అంతర్గత నిర్మాణం, స్వరూపంపై అధ్యయనం చేశారు.
  • బీర్బల్‌ సాహ్ని నెఫ్రోలెప్సిస్, నిఫోబోలస్, టాక్సస్, సైలోటమ్, టెమెసిప్టెరిస్, అక్మోపైల్‌ లాంటి మొక్కల జాతులపై పరిశోధనలు చేశారు. వాటి పరిణామ ధోరణులను, భౌగోళిక విస్తరణను పరిశీలించారు.
  • శంఖాకార వృక్షాల్లో టాక్సస్, టోరియా, సెఫలోటాక్సస్‌ జాతులను చేర్చడానికి టాక్సాలెస్‌ అనే ప్రత్యేక క్రమాన్ని సూచించిన వారిలో సహాని ఒకరు.  

చివరగా

  • భారతదేశంలో శిలాజ వృక్షశాస్త్ర అధ్యయనాలకు ఆద్యుడు, దార్శనికుడిగా బీర్బల్‌ సాహ్ని పేరొందారు. ఈ రంగంలో నేటికీ ఆయనలా కృషి చేసిన వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆయన పాలియోబోటనీలో విస్తృత పరిశోధనలు చేశారు. ఆయన రచనలు, అధ్యయనాలు నేటికీ ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నాయి. సాహ్ని 1949, ఏప్రిల్‌ 10న లఖ్‌నవూలో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: కిందివారిలో ఎవరు ప్రపంచ ప్రసిద్ధి పాలియోబోటనిస్ట్‌గా పేరొందారు? (యూపీ టీజీటీ బయాలజీ, 2013)

1) ప్రొఫెసర్‌ ఎస్‌.ఆర్‌. కశ్యప్‌

2) డాక్టర్‌ జె.సి.బోస్‌

3) ప్రొఫెసర్‌ బీర్బల్‌ సాహ్ని

4) ప్రొఫెసర్‌ కె.సి.మెహతా

సమాధానం: 3

ప్రశ్న: బీర్బల్‌ సాహ్న కింది వేటిపై పరిశోధనలు చేశారు? (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018)

1) శైవలాలు            2) బ్రయోఫైట్స్‌

3) శిలాజ మొక్కలు        4) ఆవృతబీజాలు

సమాధానం: 3

Q: Birbal Sahni was known for his scientific research as:
(DSSSB TGT Hindi Female, 2021)
1) paleobotanist            2) chemist
3) statistician            4) astrophysicist
Ans: 1


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram