ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఐజాక్‌ న్యూటన్‌

న్యూటన్‌ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. న్యూటన్‌ ప్రయోగాలు, వెల్లడించిన విషయాలు నేటికీ భౌతికశాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా ఉన్నాయి.


న్యూటన్‌ గొప్ప గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశోధకుల్లో ఈయన ఒకరు. న్యూటన్‌ ప్రయోగాలు, వెల్లడించిన విషయాలు నేటికీ భౌతికశాస్త్రంలో ముఖ్యమైన సిద్ధాంతాలుగా ఉన్నాయి. ఈయన్ను గణిత - భౌతికశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. న్యూటన్‌ కనిపెట్టిన నియమాలు, ప్రతిపాదనలు అప్పటి వరకు భౌతిక ప్రపంచంపై మానవాళికి ఉన్న అవగాహనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. సౌర వ్యవస్థ నిర్మాణం, గ్రహాల కదలికలను వివరించడం ద్వారా ఆధునిక ఖగోళశాస్త్రానికి పునాది వేశారు. పోటీపరీక్షల నేపథ్యంలో ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • న్యూటన్‌ ఇంగ్లండ్‌లోని వూల్‌థోర్స్‌లో ఉన్న మనోర్‌ హౌస్‌లో 1642లో జన్మించారు.   గ్రాంథంలోని కింగ్స్‌ స్కూల్‌లో ఆయన పాఠశాల విద్య అభ్యసించారు. అందులో లాటిన్, ప్రాచీన గ్రీకు భాషలో చదువు చెప్పేవారు. న్యూటన్‌కు అక్కడే గణితంపై ఆసక్తి ఏర్పడింది.   
  • 1661లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేరారు. గణితం, నేచురల్‌ ఫిలాసఫీ అధ్యయనం చేశారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఫీజు చెల్లించేవారు.  
  • మ్యాథ్స్‌లో కాలిక్యులస్‌ అనే థియరీపై ఆయన అధ్యయనం చేశారు. ఆ సమయంలో లండన్‌లో ప్లేగు వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడంతో మందుజాగ్రత్త చర్యగా కేంబ్రిడ్జిని మూసేశారు. దీంతో ఆయన వూల్‌థోర్స్‌ వెళ్లి, అక్కడే తన ఇంట్లో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. 
  • 1667లో న్యూటన్‌ తిరిగి కేంబ్రిడ్జికి వచ్చారు. అదే ఏడాది ఆయన ట్రినిటీ ఫెలోగా ఎన్నికయ్యారు. 1668లో ఎంఏ డిగ్రీ పొందారు. 
  • 1669లో కేంబ్రిడ్జిలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 
  • తర్వాతి కాలంలో ఆయన అనేక పరిశీలన పత్రాలు విడుదల చేశారు. పుస్తకాలు రచించారు. 

ముఖ్యమైన ప్రయోగాలు/ ఆవిష్కరణలు

  • 1666లో కాలిక్యులస్‌పై ముఖ్యమైన మాన్యుస్క్రిప్ట్‌ రాశారు. అదే ఏడాది కాంతి, రంగులపై పరిశోధనలు చేశారు. ప్రిజమ్‌లతో చేసిన ప్రయోగాల ద్వారా రంగుల వర్ణపటాన్ని వివిధ కోణాల్లో వక్రీభవనం చెందించి, తిరిగి తెల్లటి కాంతిలోకి మార్చవచ్చని నిరూపించారు.
  • 1701లో శీతలీకరణ నియమాన్ని (లా ఆఫ్‌ కూలింగ్‌) అభివృద్ధి చేశారు.
  • 1710లో రచించిన ‘ఆన్‌ ది నేచర్‌ ఆఫ్‌ యాసిడ్స్‌’ అనే వ్యాసంలో రసాయన శక్తి అసంపూర్ణ సిద్ధాంతాన్ని ప్రచురించారు.

గౌరవాలు

  • 1689-90, 1701-02లో రెండుసార్లు కేంబ్రిడ్జి యూనివర్సిటీ తరఫున పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
  • 1699లో ఫ్రెంచ్‌ అకాడమీ డెస్‌ సైన్సెస్‌లో విదేశీ అసోసియేట్‌గా నియమితులయ్యారు.
  • 1703లో రాయల్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరణించేవరకు ఆ పదవిలో ఉన్నారు.

చివరగా

  • న్యూటన్‌ ఒక అసాధారణ మేధావి. గణిత, భౌతిక శాస్త్రాలపై ఆయన చేసిన ప్రయోగాలు వాటి అభివృద్ధికే కాక తర్వాతి కాలంలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి. ఆయన రచనల ద్వారా శాస్త్రీయ రంగంపై అవగాహన కలుగుతుంది.  

 


Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram