ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందిన కొద్దీ మహాసముద్రాలు కూడా అంతే స్థాయిలో కాలుష్యాల బారిన పడుతున్నాయి. ఈ ప్రభావం సముద్ర జీవులతోపాటు, మానవాళిపైనా అధికంగానే ఉంటోంది. సముద్ర వనరుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఏటా జూన్ 8న ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా (World Oceans Day) నిర్వహిస్తారు. మహాసముద్రాల పరిరక్షణ, దాని కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
మహాసముద్రాలు అంటే?
ఖండాల మధ్య విస్తరించిన మహా జలభాగాలే మహాసముద్రాలు. భూ ఉపరితల వైశాల్యం సుమారు 510 మిలియన్ చ.కి.మీ. ఉండగా దానిలో జలావరణ వైశాల్యం సుమారు 361 మి.చ.కి.మీ.గా ఉంది. అంటే దాదాపు 71 శాతం భూభాగం నీటితోనే ఆవరించి ఉంది. అందులో ఎక్కువ భాగం మహాసముద్రాలే. ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో, భూమిపై నీటి సమతౌల్యాన్ని కాపాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
14వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం
చారిత్రక నేపథ్యం
బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో 1992, జూన్ 3 నుంచి 14 వరకు ఎర్త్ సమ్మిట్ జరిగింది. అందులో జూన్ 8న కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్‌మెంట్ (ఐసీఓడీ) ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించింది. 2008లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూన్ 8ని ‘ప్రపంచ మహాసముద్ర దినోత్సవం’గా అధికారికంగా ప్రకటించింది.
| మహాసముద్రాలు - విస్తరణ - వాటి ప్రాముఖ్యతలు, జలాల కదలిక, అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు తదితర సమాచారంతోపాటు తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భూమిపై ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి?
(ఎంపీ వ్యాపం సబ్-ఇంజినీర్ ఎలక్ట్రికల్, 2016)
1) 7 2) 6 3) 5 4) 4
సమాధానం: 3
2. ప్రపంచంలోనే అతిచిన్న మహాసముద్రం ఏది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)
1) పసిఫిక్ 2) ఆర్కిటిక్ 3) హిందూ 4) అట్లాంటిక్
సమాధానం: 2
3. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎల్‌ఎంఆర్‌సీ జేఈ ఈఈ, 2020), (సుప్రీంకోర్ట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్, 2022),
(గుజరాత్ పీఎస్‌ఐ, 2025)
1) జూన్ 9 2) జూన్ 11
3) జూన్ 8 4) జూన్ 10
సమాధానం: 3
4. ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం ఏది?
(యూపీయూఎంఎస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, 2024)
1) అట్లాంటిక్ 2) హిందూ 3) పసిఫిక్ 4) ఆర్కిటిక్
సమాధానం: 3
5. World Ocean Day 2025, observed on 8 June, emphasised which of the following themes?
(RRB Group D, 2025)
1) Blue Future, Green Planet 2) Wonder: Sustaining what sustains us
3) Sustain the Sea 4) Revive Ocean Life
Ans: 2
6. In which of the following oceans, the complete disorganization of the direction of the stream can be seen?
(RPF Constable, 2019)
1) Pacific Ocean 2) Arctic Ocean
3) Indian Ocean 4) Atlantic Ocean
Ans: 3
7. Which among the following is an “S” shaped ocean?
(SSC GD Constable, 2023)
1) Indian Ocean 2) Arctic Ocean 3) Pacific Ocean 4) Atlantic Ocean
Ans: 4