ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య. దీని కారణంగా మానవాళికి, ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుతోంది. ఉగ్రవాదుల కుట్రకు బలైన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా మే 21న ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా (Anti-Terrorism Day) నిర్వహిస్తారు. హింస వల్ల సమాజానికి వాటిల్లే నష్టం, ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

ఉగ్రవాదం అంటే?

  • రాజకీయ, సైద్ధాంతిక లేదా మతపరమైన లక్ష్యాలను సాధించడానికి ఒక వ్యవస్థీకృత పద్ధతి ద్వారా పౌరులను హింసించి, బెదిరించడాన్ని ఉగ్రవాదం అంటారు. మన దేశంలో ఉగ్రవాదం అనేది జాతీయ భద్రత, సామాజిక - ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేస్తూ అనేక సవాళ్లను విసురుతోంది.  
  • భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్‌ 113 ప్రకారం, భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, భద్రత లేదా ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో చేసే ఏ చర్య అయినా; లేదా భారతదేశంలోని వ్యక్తులు లేదా విదేశాల్లోని వారు ఇక్కడి ప్రజల్లో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్న ఏ చర్యను అయినా ఉగ్రవాద చర్యగా పేర్కొంటారు.
  • మరణం, శారీరక హాని, ఆస్తి విధ్వంసం, నిత్యావసర సేవలకు అంతరాయం కలిగించడం లేదా కీలక మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగించడం మొదలైనవాటి కోసం ప్రమాదకర పదార్థాలు, పేలుడు సామాగ్రి, తుపాకులు లేదా ఇతర మారణాయుధాలు ఉపయోగించడం లాంటి చర్యలు ఇందులో ఉంటాయి.
  • ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు రుజువైన ఎవరికైనా మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. అలాంటి చర్యలకు కుట్రపన్నినా, సాయం చేసినా, ప్రేరేపించినా లేదా తెలిసి సహకరించిన వ్యక్తులకు అయిదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష విధిస్తారు.

చారిత్రక నేపథ్యం

  • 1991 మే 21న నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబదూరులో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. శ్రీలంకకు చెందిన లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) ఉగ్ర సంస్థ అందులో ఆత్మాహుతి బాంబుదాడికి పాల్పడింది. ఇందులో రాజీవ్‌తోపాటు 14 మంది మరణించారు.
  • రాజీవ్‌ గాంధీ హత్యను స్మరించుకోవడంతోపాటు, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతి - సామరస్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటి వి.పి.సింగ్‌ ప్రభుత్వం మే 21న ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. 1992 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

టెర్రరిజం వర్గీకరణ, గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ (జీటీఐ) - 2026, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ చేపట్టిన చర్యలు, భారత్‌లో చోటుచేసుకున్నఉగ్రదాడులు తదితర పూర్తి సమాచారంతోపాటు ఈ టాపిక్‌ గురించి ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్‌ మొదలైన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌... ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు 

1. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఎప్పుడు హత్యకు గురయ్యారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీజీటీ పొలిటికల్‌ సైన్స్, 2021)

1) 1992, జూన్‌ 21   2) 1990, మే 20

3) 1991, మే 30    4) 1991, మే 21

సమాధానం: 4

2. భారతదేశంలో ఏటా మే 21న కింది దేన్ని పాటిస్తారు?

(సీడీఎస్‌ జీకే, 2019),(బిహార్‌ విధానపరిషత్‌ (డీఈఓ), 2023)

1) ఎన్‌ఆర్‌ఐ దినోత్సవం

2) జాతీయ యువజన దినోత్సవం

3) జాతీయ సాంకేతిక దినోత్సవం

4) జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం

సమాధానం: 4

3. Anti-Terrorism Day is associated with death anniversary of which of the following former Prime Minister of India?
(Punjab Police Jail Warder and Matron 2021)
1) Indira Gandhi            2) Rajiv Gandhi 
3) Lal Bahudar Shastri        4) Atal Bihari Vajpayee 
Ans: 2 
4. Among the following persons whose birth anniversary is celebrated as Sadbhavana Divas and death anniversary as Anti-Terrorism Day?
(Karnataka Civil Police Constable 2019)
1) Indira Gandhi            2) Rajiv Gandhi
3) Mahatma Gandhi            4) Sanjay Gandhi
Ans: 2
5. Which of the following countries passed its first Anti-Terrorism law in December 2015?
(NTPC CBT 2 2017)
1) Australia        2) Syria        3) India        4) China
Ans: 4
6. Terrorist and Disruptive Activities (Prevention) Act, commonly known as TADA was enacted because of _______.
(MP Forest Guard/Jail Prahari 2023)
1) Kargil War                2) Indo-China War
3) Punjab insurgency        4) Formation of Pakistan
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram