జాతీయ సముద్ర దినోత్సవం

జాతీయ సముద్ర దినోత్సవం

భారతదేశానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి. ఇవి ప్రపంచ వాణిజ్యానికి, రవాణాకు గణనీయంగా ఉపయోగపడుతూ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి. దేశంలో అతి పురాతన, చౌకైన రవాణా మార్గంగానూ నిలుస్తున్నాయి. కాలుష్యరహితంగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో సరకుల రవాణాకు ఇవి ఉత్తమ మార్గం. భారతదేశ ఆర్థిక వృద్ధిలో సముద్రయాన పరిశ్రమ పాత్రను తెలిపే లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 5న ‘జాతీయ సముద్ర దినోత్సవం’గా (National Maritime Day) నిర్వహిస్తారు. సముద్రాల చరిత్ర, వారసత్వం; అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా, దేశ ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  

ముఖ్యాంశాలు..

  • దేశ వాణిజ్యంలో సముద్రాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. మొత్తం వాణిజ్యంలో పరిమాణ పరంగా 95%, విలువ ప్రకారం 70 శాతాన్ని ఇవి నిర్వహిస్తున్నాయి.
  • జలమార్గాల అభివృద్ధికి ‘ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ సంస్థను 1986, అక్టోబరు 17న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.
  • దేశంలో మొదటి నౌకారవాణా కంపెనీ 1840లో ‘బాంబే స్టీమ్‌ నావిగేషన్‌’ పేరుతో ఏర్పాటైంది.
  • 1858లో ‘జాతీయ షిప్పింగ్‌ బోర్డు’ ఏర్పాటైంది. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను 1961, అక్టోబరు 2న బొంబాయిలో స్థాపించారు.

ప్రధాన ఓడరేవులు

2026, ఏప్రిల్‌ 5 నాటికి భారత్‌లో 13 ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వ ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇవి దేశ సముద్ర సరకు రవాణాలో అధిక భాగాన్ని నిర్వహిస్తాయి. మేజర్‌ పోర్టులు - అవి ఉన్న రాష్ట్రాలను పరిశీలిస్తే..

తూర్పు తీర ఓడరేవులు:

సంఖ్య   పోర్ట్‌ పేరు    రాష్ట్రం
1   కోల్‌కతా పోర్ట్‌ పశ్చిమ బెంగాల్‌
2   పారాదీప్‌ పోర్ట్‌ ఒడిశా
3  విశాఖపట్నం పోర్ట్‌ ఆంధ్రప్రదేశ్‌
4  కామరాజర్‌/ ఎన్నోర్‌ పోర్ట్‌ తమిళనాడు
5   చెన్నై పోర్ట్‌ తమిళనాడు
6 ట్యూటికొరిన్‌ పోర్ట్‌ తమిళనాడు

పశ్చిమ తీర ఓడరేవులు..

7  కొచ్చిన్‌ పోర్ట్‌ కేరళ
8 న్యూ మంగళూరు పోర్ట్‌   కర్ణాటక
9  మార్మగోవా పోర్ట్‌   గోవా
10  ముంబయి పోర్ట్‌ మహారాష్ట్ర
11 జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ మహారాష్ట్ర
12 కాండ్లా పోర్ట్‌   గుజరాత్‌
13  పోర్ట్‌ బ్లెయిర్‌

 అండమాన్‌ - నికోబార్‌ దీవులు

చారిత్రక నేపథ్యం:

  • భారత్‌లోని సింధియా స్టీల్‌ నావిగేషన్‌ కంపెనీకి చెందిన ‘ఎస్‌ఎస్‌ లాయల్టీ’ అనే నౌక 1919, ఏప్రిల్‌ 5న మొదటిసారి ముంబయి నుంచి లండన్‌కు ప్రయాణమైంది. అంతకు ముందు వరకు కేవలం బ్రిటిష్‌ నౌకల ద్వారానే సముద్రయానం జరిగేది.
  • ఈ రోజును పురస్కరించుకుని భారత ప్రభుత్వం 1964లో తొలిసారి జాతీయ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. విశాఖపట్నం ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) మహారాష్ట్ర      2) ఆంధ్రప్రదేశ్‌          3) ఒడిశా      4) గుజరాత్‌

సమాధానం: 2

2. జవహర్‌లాల్‌ నెహ్రూ ఓడరేవు ఎక్కడ ఉంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) భువనేశ్వర్‌          2) కోల్‌కతా          3) చెన్నై          4) ముంబయి

సమాధానం: 4

3. Which is the largest container port in India?
(SSC CGL 2023 Tier-I)

1) Kandla Port           2) Jawaharlal Nehru Port

3) Kolkata Port          4) Hazira Port

Ans: 2

4. The 'Chennai Port' is located along which of the following water bodies?
(RRB NTPC Graduate Level, 2025)

1) Arabian Sea              2) Andaman Sea

3) Bay of Bengal           4) Gulf of Mannar

Ans: 3

5. Which of the following is an artificial port in India?
(SSC MTS 2024), (70th BPSC, 2024)

1) Mumbai port          2) Chennai port  

3) Kolkata port              4) Deendayal port

Ans: 2

6. Which port is one of the oldest artificial ports on the eastern coast?
(NTPC CBT-I, 2021)

1) Chennai port              2) Kandla port

3) Visakhapatnam Port        4) Paradip Port

Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram