ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌
  • ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవం’ సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని వెల్‌బీయింగ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ 2026, మార్చి 19న వరల్డ్‌ హ్యపీనెస్‌ రిపోర్ట్‌ 2026లో ఫిన్లాండ్‌ వరసగా తొమ్మిదో సారి ప్రథమ స్థానం దక్కించుకుంది. నార్డిక్‌ దేశాలైన ఐస్‌లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వేలు కూడా మొదటి 10 దేశాల్లో స్థానం సంపాదించాయి. 2023లో 23వ స్థానంలో ఉన్న కొస్టారికా ఈసారి నాలుగో స్థానానికి ఎగబాకింది.  
  • అత్యంత సంతోషకర దేశాల జాబితాలో భారత్‌ ఈ ఏడాది 116వ స్థానంలో నిలిచింది. 2025లో పొందిన ర్యాంకు 118 కంటే ఈ దఫా కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. అవినీతి, దాతృత్వం, స్వేచ్ఛ, తలసరి ఆదాయం, ఆరోగ్యకర జీవనం వంటి విభాగాల వారీగా చూసినప్పుడు ఈ ఏడాది (2026) స్థాయులు చాలా మెరుగయ్యాయి. 
 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram