పిల్లల సమగ్ర ఎదుగుదలకు అవరోధంగా ఉన్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ తాజాగా ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణమని ఇది వెల్లడించింది. దీని ప్రకారం, పోషకాహార లోపంతో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తగినంతగా అందట్లేదు. 35.5% పిల్లల్లో పెరుగుదల లోపాలున్నాయి. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో 30.1%, గ్రామీణ ప్రాంతాల్లో 37.3% మందిలో ఉంటోంది. మేఘాలయలో అత్యధికంగా 46.5% పిల్లలు ఈ లోపంతో బాధపడుతున్నారు.