కశ్మీర్‌ సంస్థాన విలీనం

కశ్మీర్‌ సంస్థాన విలీనం

ఆంగ్లేయుల ప్రత్యక్ష అధీనంలో కాకుండా స్వదేశీ రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలను ‘స్వదేశీ సంస్థానాలు’గా పేర్కొంటారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్లో స్వదేశీ సంస్థానాల విలీనం ఒకటి. వీటిలో చాలా వరకు చిన్న రాజ్యాలే ఉండేవి. మౌంట్‌ బాటెన్‌ ప్రణాళికలో ఈ స్వదేశీ సంస్థానాలకు నిర్ణయాధికారం ఇచ్చారు. దీని ప్రకారం అవి పాకిస్థాన్‌ లేదా భారతదేశంలో కలవచ్చు లేదా ఏ దేశంలోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండొచ్చు. భారత్‌ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించాక ఈ విధానం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరంగా మారింది. అనేకమంది స్వదేశీ సంస్థానాధీశులు స్వతంత్రంగా ఉండాలని భావించగా, మరికొందరు పాకిస్థాన్‌లో కలిసేందుకు ప్రయత్నించారు. స్వతంత్ర భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఆ సంస్థానాలు భారత్‌లో కలిసేలా కృషి చేశారు. ఈయన చొరవతో సుమారు 562 స్వదేశీ సంస్థానాలు మన దేశంలో విలీనమయ్యాయి. దీని వల్లే పటేల్‌ ఇండియన్‌ బిస్మార్క్‌గా, ఉక్కు మనిషిగా పేరొందారు. ఆయన కృషి ఫలితంగా అక్టోబరు 26న కశ్మీర్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పోటీపరీక్షల నేపథ్యంలో నాటి విలీన ప్రక్రియకు సంబంధించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

కశ్మీర్‌ సంస్థానం ఏర్పాటు

  • 19వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా రంజిత్‌ సింగ్‌ సిక్కు రాజ్యాన్ని విస్తరింపజేసి ఏకీకృతం చేశాడు. అతడి మరణానంతరం బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ పంజాబ్‌ను హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ పరిణామాలే మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధానికి దారితీశాయి. ఇందులో బ్రిటిష్‌ వారు విజయం సాధించారు. లాహోర్‌ సంధితో యుద్ధం ముగిసింది. దీని ప్రకారం, కశ్మీర్‌ ఆంగ్లేయుల అధీనంలోకి వెళ్లింది. తర్వాతి కాలంలో గులాబ్‌సింగ్‌ బ్రిటిష్‌ వారి నుంచి కశ్మీర్‌ను కొనుగోలు చేసి, సంస్థానంగా ఏర్పాటు చేసి దానికి మొదటి మహారాజు అయ్యారు. ఈయన్ను డోగ్రా రాజవంశ స్థాపకుడిగా పేర్కొంటారు. 

విలీనం ఇలా..

  • కశ్మీర్‌ సంస్థానం భౌగోళికంగా జమ్మూ, కశ్మీర్, గిల్గిత్, లద్దాఖ్‌ అనే నాలుగు ప్రధాన భాగాలుగా ఉండేది. 1947 నాటికి రాజా హరిసింగ్‌ కశ్మీర్‌ సంస్థానాధీశుడిగా ఉన్నారు.
  • స్వాతంత్య్రానంతరం కశ్మీర్‌ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని హరిసింగ్‌ భావించారు. కశ్మీర్‌ను తమ యూనియన్‌లో కలపాలని పాకిస్థాన్‌ ఒత్తిడి తెచ్చినా ఆయన సమ్మతించలేదు. దీంతో పాకిస్థాన్‌ 1947, అక్టోబరు 22న కశ్మీర్‌పై తమ సరిహద్దు సైన్యంతో ప్రత్యక్ష దాడికి పాల్పడింది. హరిసింగ్‌ సైనిక సాయం కోరుతూ భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. భారత యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తేనే సైనిక సహాయం చేయడానికి వీలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడంతో హరిసింగ్‌ దానికి అంగీకరిస్తూ, ‘ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ అక్సెషన్‌’పై సంతకం చేశారు. దీంతో 1947, అక్టోబరు 26న కశ్మీర్‌ భారత్‌లో విలీనమైంది. 
  • వెంటనే భారత సైన్యం శ్రీనగర్‌ చేరుకుని పాక్‌ సైన్యాన్ని అడ్డుకుంది. కానీ అప్పటికే పాకిస్థాన్‌ కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. దాన్నే ప్రస్తుతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)గా పిలుస్తున్నారు.

గతంలో అడిగిన ప్రశ్నలు

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

Q: కిందివారిలో ఆర్టికల్‌ 370 ప్రధాన రూపకర్త ఎవరు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ      2) రఘుబీర్‌ దాస్‌     3) గోపాలస్వామి అయ్యంగార్‌     4) బీఆర్‌ అంబేడ్కర్‌

సమాధానం: 3

(This question was previously asked in JKSSB Panchayat Secretary (VLW) 2017)
Q:
Which clause of Article 370 gives power to the President to declare that Article 370 shall cease to be operative?
1) Clause 13     2) Clause 23      3) Clause 3      4) Clause 33  
Answer: 3

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram