వందేమాతర గేయం @ 150 ఏళ్లు! 

వందేమాతర గేయం @ 150 ఏళ్లు! 

స్వాతంత్య్రోద్యమ సమయంలో ‘వందేమాతర గీతం’ దేశప్రజలను ఏకం చేసింది. ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో సామాన్యులకు స్ఫూర్తి మంత్రంలా నిలిచింది. ప్రస్తుతం ఇది ప్రతి భారతీయ పౌరుడి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ గీతం భారతదేశ సంస్కృతి, చారిత్రక గుర్తింపుకి ప్రతీక. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రతిఘటన, ఐక్యత, ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన వందేమాతర గేయానికి నవంబరు 7న 150 ఏళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో దీనికి సంబంధించిన ముఖ్య విశేషాలను నేటి స్టడీ జోన్‌లో తెలుసుకుందాం..!

నేపథ్యం

  • బ్రిటిష్‌ ప్రార్థనా గీతం ‘గాడ్‌ సేవ్‌ ది కింగ్‌’ని భారత జాతీయ గీతంగా ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని మెజారిటీ భారతీయ జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. 
  • ఆంగ్లేయుల చర్యకు ప్రతిస్పందనగా బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ 1875, నవంబరు 7న వందేమాతర గేయాన్ని రచించారు. సంస్కృతం, బెంగాలీ పదాలను మిళితం చేసి ఆయన దీన్ని రాశారు.
  • ఛటోపాధ్యాయ 1882లో రచించిన ‘ఆనందమఠ్‌’ నవలలో దీన్ని ప్రార్థనా గేయంగా ఉపయోగించారు.

వ్యాప్తి

  • నాటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ కర్జన్‌ 1905, జులై 20న బెంగాల్‌ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ అధికారిక ప్రకటన చేశారు. 1905, అక్టోబరు 16 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశప్రజలంతా భారతమాతను స్మరించుకుంటూ ‘వందేమాతరం గేయాన్ని’ పాడారు. దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. తక్కువ కాలంలోనే ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
  • బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలోనూ వందేమాతర గేయమే మంత్రమైంది. ముఖ్యంగా బిపిన్‌ చంద్రపాల్‌ వందేమాతర గీతాన్ని దేశానికి పరిచయం చేశారు. ఈయన కలకత్తాలో 1905లో వందేమాతరం పేరుతో వార్తాపత్రికను నెలకొల్పారు. దీనికి ఎడిటర్‌గా అరబిందో ఘోష్‌ వ్యవహరించారు.

బంకిమ్‌చంద్ర ఛటోపాధ్యాయ

  • ఈయన 1938, జూన్‌ 27న బెంగాల్‌ ప్రెసిడెన్సీలోని నైహతిలో జన్మించారు. ఆయన కవి, పాత్రికేయుడు, నవలా రచయిత. ఈయన్ను ఆధునిక బెంగాలీ సాహిత్య పితామహుడిగా పేర్కొంటారు.
  • బంకిమ్‌చంద్ర బ్రిటిష్‌ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 1891లో పదవీ విరమణ చేశారు.
  • బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి 1891లో రాయ్‌ బహదూర్‌ బిరుదు పొందారు. 1894లో కంపానియన్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎమినెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎంపైర్‌గా నియమితులయ్యారు.
  • 1872లో బంగదర్శన్‌ అనే మాస సాహిత్య పత్రికను నెలకొల్పారు.
  • బంకిమ్‌చంద్ర 1894, ఏప్రిల్‌ 8న మరణించారు. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(TSPSC FBO 2017)
Q: The editor of newspaper 'Vandemataram' was....
1) Atulya Ghosh            2) Ajoy Kumar Mukherjee
3) Aurobindo Ghosh        4) Bankim Chandra Chatterjee
Answer: 3
 
(67th BPSC Prelims, 2022)
Q: In Anandamath of Bankim Chandra Chatterjee, which revolt is mentioned?
1) Sannyasi                2) Kuka
3) Santhal                    4) Neel (Indigo)
5) None of the above/ More than one of the above
Answer: 1 

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram