భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు

భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు

ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది గొప్ప విదేశీ రాయబారులు, యాత్రికులు ప్రాచీన భారతదేశాన్ని సందర్శించారు. వారు రాజాస్థానాలకు వచ్చి ఇక్కడి పరిస్థితుల గురించి అనేక గ్రంథాలు రాశారు. ముఖ్యంగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై అనేక పరిశోధనలు చేశారు. వీరి రచనల ద్వారానే మన విశిష్టత బయటి దేశాలకు తెలిసింది. ఈ యాత్రికులు దేశవ్యాప్తంగా సంచరించి తాము గమనించిన అనేక విషయాలను సంగ్రహణం చేశారు. పోటీపరీక్షల నేపథ్యంలో విదేశీ రాయబారులు, యాత్రికులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం..!

ఆసక్తికి కారణం..

  • భారతదేశానికి ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వం, విస్తారమైన భౌగోళిక స్వరూపం, పురాతన నాగరికత మొదలైనవన్నీ విదేశీయులకు మన పట్ల ఆసక్తికి కారణమయ్యాయి.  
  • ప్రాచీన గ్రీకు పండితుల నుంచి మధ్యయుగ అరబ్‌ వ్యాపారులు.. ఆధునిక యూరోపియన్ల వరకు అందరూ ఇక్కడికి వచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలు - ఆచార వ్యవహారాలు, మతపరమైన అంశాల పట్ల ఆకర్షితులై వచ్చిన వారు కొందరైతే, మన అపార సహజ సంపద, వనరులు, రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలనుకున్నవారు ఇంకొందరు.
  • భారతదేశంలోని పరిస్థితులు, స్థితిగతులు, వనరులు మొదలైనవన్నీ బయటివారికి తెలియడానికి కారణం విదేశీ యాత్రికుల రచనలే. వీరంతా ఇక్కడి గొప్ప సంస్కృతి, సామాజిక - ఆర్థిక నిర్మాణం, శక్తిమంతమైన సామ్రాజ్యాల వైభవాన్ని చాటిచెప్పారు. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతిని తెలిపిన వీరి రచనల కారణంగా మన చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో కలిగింది. 

యాత్రికులు, రాయబారుల సందర్శనకు కారణాలు

  • మతపరమైనవి: చైనాకు చెందిన బౌద్ధ పండితుడు హుయాన్‌త్సాంగ్‌ భారత్‌లో బౌద్ధ మత మూలాలు, ఆచారాలు అధ్యయనం చేయడానికి వచ్చారు. ఇలాంటి ఉద్దేశాలతోనే ఇంకొందరు సైతం మన దేశాన్ని సందర్శించారు.
  • వ్యాపార సంబంధమైనవి: ఇక్కడ లభించే అరుదైన వజ్రాలు, వస్తువులు, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ విదేశీ వ్యాపారులను ఆకర్షించాయి.
  • సాంస్కృతిక అంశాలు: కళలు, తత్వశాస్త్రం, సంప్రదాయాల్లో భారతదేశానికి గొప్ప వారసత్వం ఉంది. వాటి గురించి తెలసుకోవడం, నేర్చుకోవడం పట్ల అనేకమంది ఆసక్తి చూపారు.
  • రాజకీయ లక్ష్యాలు: ఇక్కడి సంస్థానాలు, రాజ్యాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను ఏర్పర్చుకోవాలనే ఉద్దేశంతో మెగస్తనీస్‌ లాంటి రాయబారులు భారత్‌కు వచ్చారు.
  • శాస్త్రీయ అభ్యాసం: ఖగోళశాస్త్రం, గణితం, వైద్యరంగంలో భారత్‌ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. వివిధ దేశాల పండితులు వీటిని నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు.
  • చారిత్రక అంశాలు: గ్రీకు యాత్రికుడు టాలెమీ ప్రాచీన భారతీయ సమాజం, భౌగోళికశాస్త్రం, చరిత్రకు సంబంధించిన విషయాలను క్రోడీకరించి, గ్రంథంగా రాయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు.

భారతదేశాన్ని సందర్శించిన కొందరు విదేశీ యాత్రికులు/ రాయబారులు

పేరు దేశం

సంవత్సరం/

శతాబ్దం

రాజ వంశం/ 

రాజు కాలం

ప్రత్యేకత/ రచన
మెగస్తనీస్‌ గ్రీకు క్రీ.శ.302

మౌర్య వంశం -

చంద్రగుప్త మౌర్యుడు 

* ‘భారత చరిత్ర పితామహుడిగా’ పిలుస్తారు.

* ప్రఖ్యాత చారిత్రక గ్రంథం అయిన ఇండికాను రచించాడు

ఫా-హియాన్‌/

ఫాక్సియాన్‌

చైనా క్రీ.శ.399

గుప్త వంశం -

రెండో చంద్రగుప్తుడు

* భారత్‌ను సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు.

* ఫో-క్వో-కి (ట్రావెల్స్‌ ఆఫ్‌ ఫా-హియాన్‌) గ్రంథం రాశారు.

హుయాన్‌త్సాంగ్‌/

జువాన్‌జంగ్‌

  చైనా క్రీ.శ.630

పుష్యభూతి వంశం -

హర్షవర్ధనుడు

* సి-యు-కి, చెంగ్‌ విషి లూన్‌ అనే గ్రంథాన్ని రాశాడు.

 * వసుమిత్ర మహావిభాస అనే గ్రంథాన్ని చైనీస్‌ భాషలోకి అనువదించాడు. 

 అల్‌-మసూదీ బాగ్దాద్, ఇరాక్‌ క్రీ.శ.915

ప్రతిహార వంశం -

ఒకటో మహిపాల

* అఖ్బర్‌ అల్‌ - జమాన్, మురుజ్‌ అల్‌-దహబ్‌ వా మయిదీన్‌ అల్‌-జవాహిర్, కితాబ్‌ అట్‌-తన్బిహ్‌ వా-ల్‌-ఇష్రాఫ్‌ లాంటి గ్రంథాలు రాశారు.

* అట్లాంటిక్‌ మహాసముద్రానికి ముదురు-ఆకుపచ్చ సముద్రం అని పేరు పెట్టాడు. 

అల్‌ బెరూనీ ఖిజా, ఉజ్బెకిస్థాన్‌ క్రీ.శ. 1017              -

* మహమ్మద్‌ గజనీతోపాటు భారత్‌కు వచ్చాడు.

* కితాబ్‌-ఉల్‌-హింద్‌/ తహ్కిక్‌-ఇ-హింద్, క్రోనాలజీ ఆఫ్‌ ఏన్షియంట్‌ నేషన్స్‌ అనే గ్రంథాలు రాశాడు.

మార్కోపోలో వెనిస్, ఇటలీ క్రీ.శ. 1292

కాకతీయ వంశం -

రుద్రమదేవి 

* ద ట్రావెల్స్‌ ఆఫ్‌ మార్కో పోలో గ్రంథం రాశాడు.


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ 2025)

Q. కింది ఎవరు రాజుగా ఉన్న సమయంలో చైనా యాత్రికుడు ఫా-హియాన్‌ భారతదేశానికి వచ్చాడు? 

1) సముద్రగుప్తుడు            

2) రెండో చంద్రగుప్తుడు

3) మొదటి కుమారగుప్తుడు        

4) స్కందగుప్తుడు

సమాధానం: 2


Delhi Police Constable (Executive) 2023 Official Paper)

Q:
With reference to the travellers who visited India, who among the following was from Portugal? 
1) François Bernier    
2) Nicolo Conti
3) Ibn Batuta        
4) Duarte Barbosa
Answer: 4 

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram