ప్రస్తుత సంవత్సరంలో (2026-27) భారత ఇంధన పెట్టుబడులు 170 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16 లక్షల కోట్ల)కు చేరొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ 2026 నివేదికలో వెల్లడించింది. సౌర విద్యుత్, చమురు రిఫైనింగ్ విభాగాల్లో వేగవంత విస్తరణ ఇందుకు కారణమని పేర్కొంది.
పెరుగుతున్న ఇంధన గిరాకీకి తగ్గట్లు సరఫరా పెంచేందుకు, స్వచ్ఛ ఇంధనం దిశగా మౌలిక సదుపాయాల బలోపేతానికి భారత ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని తెలిపింది.