ఆపరేషన్‌ దండాయన

ఆపరేషన్‌ దండాయన
  • మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్‌ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇలాంటి కేసులన్నింటినీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. పక్కాగా దర్యాప్తు చేపట్టి అన్ని రకాల సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో అభియోగపత్రాలు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటారు.
  • న్యాయస్థానాల్లో ఆ కేసు విచారణ వేగంగా పూర్తయ్యేలా స్పీడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ తెస్తారు. ఆ కేసుల ట్రయల్‌కు సంబంధించిన పురోగతిని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ వివిధ దశల్లో ఎప్పటికప్పుడు సమీక్షించి.. ట్రయల్‌ త్వరగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలూ చేపడతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram